బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. టాపార్డర్ విఫలమైనా చోట రోహిత్ శర్మ 121 నాటౌట్ (69 బంతులు, 11 ఫోర్లు, 8 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ20లలో హిట్‌మ్యాన్‌కు ఇది ఐదో శతకం.
Also Read.. కోదండ రాం రాం.. మాస్టర్ కి మైండ్ బ్లోయింగ్ షాక్..!
రోహిత్‌కు తోడుగా రింకూ సింగ్ 69 నాటౌట్ (39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆఖరి ఓవర్లో రోహిత్.. 4, 6, 4 తో పాటు రింకూ కూడా హ్యాట్రిక్ సిక్సర్లు బాదడంతో భారత్ 200 పరుగుల దాటింది. ఆఖరి ఓవర్లో ఏకంగా 36 పరుగులు రాబట్టారు. తొలి పది ఓవర్లలో 61 పరుగులు మాత్రమే రాగా.. తర్వాతి 60 బంతుల్లో 151 పరుగులు రావడం విశేషం.
