ఫాస్టాగ్ దుర్వినియోగానికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది ఎన్ హెచ్ఏఐ. ఒకే ఫాస్టాగ్ తో పలు వాహనాలు వినియోగిస్తుండటంతోపాటు కేవైసీ పూర్తవ్వకుండానే ఫాస్టాగ్ లను జారీ చేస్తున్నట్లు గుర్తించిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వీటికి చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. దీనిలో భాగంగానే వన్ వెహికల్, వన్ ఫాస్టాగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి ఫాస్టాగ్ వినియోగదారులు తప్పకుండా కేవైసీ పూర్తిచేయాలని..దీనికి సంబంధించి ఈనెల 31 వరకు గడువు విధించినట్లు వెల్లడించింది. ఆ తర్వాత ఫాస్టాగ్ లు డీయాక్టివేట్ అయ్యే ఉందని తెలిపింది. వినియోగదారులు ఆ లోపు కేవైసీని పూర్తిచేసుకోవాలి.
కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి?
వినియోగదారులు ముందుగా ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి. అందులో మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ అథెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత డ్యాష్ బోర్డులో మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లాలి. అక్కడ కేవైసీ స్టేటస్ ను చెక్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: నిర్లక్ష్యం ఖరీదు…ఇండిగోకు రూ. 1.50కోట్ల జరిమానా..!!
ఒకవేళ ఫాస్టాగ్ కేవైసీ పెండింగ్ లో ఉంటే సబ్ సెక్షన్ ద్వారా అప్ డేట్ చేసుకోవాలి. దీనికోసం అవసరమైన ఐడీ కార్డుతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్ తోపాటు పాస్ పోర్టు సైజ్ ఫొటో కావాలి. అన్ని అప్ లోడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సబ్ మీట్ బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూపై క్లిక్ చేస్తే కేవైసీ వెరిఫికేసన్ కంప్లీట్ అవుతుంది.
