Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ‘డబుల్‌’ ధమాకా.. రేపట్నుంచి మొదలుకానున్న రెండు లీగ్‌లు-Namasthe Telangana

TelanganapressBy TelanganapressJanuary 18, 2024No Comments

IL T20: ఇప్పటికే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), సౌతాఫ్రికాలో ఎస్‌ఎ 20 ద్వారా పొట్టి క్రికెట్‌ అభిమానులకు టీ20 వినోదం దక్కుతుండగా రేపట్నుంచి ఆ డోస్‌ మరింత పెరగనుంది.

January 18, 2024 / 05:43 PM IST
IL T20: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ‘డబుల్‌’ ధమాకా..  రేపట్నుంచి మొదలుకానున్న  రెండు లీగ్‌లు

IL T20:  అభిమానులను పొట్టి క్రికెట్ మజాను అందించడానికి ఆయా దేశాల్లో ఉన్న ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు అన్ని జట్లకూ సన్నాహకంగా ఉండనున్న ‘లీగ్‌ క్రికెట్‌’కు ఇప్పటికే తెరలేవగా తాజాగా మరో రెండు లీగ్‌లు శుక్రవారం (జనవరి 19) నుంచి మొదలుకానున్నాయి. యునైటైడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా రేపట్నుంచి ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 (ఐపీఎల్‌ టీ20) తో పాటు బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌) మొదలుకానున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్‌), సౌతాఫ్రికాలో ఎస్‌ఎ 20 ద్వారా పొట్టి క్రికెట్‌ అభిమానులకు టీ20 వినోదం దక్కుతుండగా రేపట్నుంచి ఆ డోస్‌ మరింత పెరగనుంది.

మరో మినీ ఐపీఎల్‌..

అరబ్బుల అడ్డా యూఏఈ, అబుదాబి, షార్జాలు వేదికగా ఐఎల్‌ టీ20 మొదలుకానుంది. మొత్తం 34 మ్యాచ్‌లు జరగాల్సి ఉన్న ఈ లీగ్‌లో ఇది రెండో సీజన్‌. ఆరు ఫ్రాంచైజీలు ఉన్న ఈ లీగ్ సైతం మినీ ఐపీఎల్‌ వంటిదే. ఆరింటిలో నాలుగు ఫ్రాంచైజీలు ఎంఐ ఎమిరేట్స్‌ (ముంబై), అబుదాబి నైట్‌ రైడర్స్‌ (కోల్‌కతా), దుబాయ్‌ క్యాపిటల్స్‌ (ఢిల్లీ), గల్ఫ్‌ జెయింట్స్‌ (అదానీ) భారత వ్యాపారస్తులకు చెందినవే. గతేడాది గల్ఫ్‌ జెయింట్స్‌ (అదానీ ఫ్రాంచైజీ) విజేతగా నిలిచిన ఈ సీజన్‌లో ఈసారి పలువురు అంతర్జాతీయ స్టార్‌ క్రికెటర్లు ఆడనున్నారు. ఇటీవలే టెస్టు, వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన డేవిడ్‌ వార్నర్‌తో పాటు కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, విండీస్‌ వీరులు సునీల్‌ నరైన్‌, ఆండ్రీ రసెల్‌, డ్వేన్‌ బ్రావో, హెట్మెయర్‌, మార్టిన్‌ గప్తిల్‌ వంటి వాళ్లు ఆడనున్నారు.

 

Ace cricketers join the exciting #DPWorldILT20 trophy tour at Khaleej Times! 🌟🏏#AllInForCricket pic.twitter.com/mtXY6JIOyQ

— International League T20 (@ILT20Official) January 18, 2024

షెడ్యూల్‌, లైవ్‌ ఇలా..

జనవరి 19 నుంచి ఫిబ్రవరి 17 దాకా జరగాల్సి ఉన్న ఈ లీగ్‌లో దుబాల్‌లో 15 మ్యాచ్‌లు, అబుదాబిలో 11, షార్జాలో 8 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్‌లు మొదలవుతాయి. ఈ మ్యాచ్‌లను భారత్‌లో లైవ్‌ ప్రసారాలను ‘జీ’ ఛానెల్‌ అందిస్తున్నది. జీ పీక్చర్స్‌, జీ సినిమా, జీ అన్మోల్‌ సినిమా, జీ జెస్ట్, జీ సినిమాలు వంటి ఛానెల్స్‌లో లైవ్‌ చూడొచ్చు. జీ5 యాప్‌లోనూ ప్రత్యక్ష ప్రసారాలున్నాయి.

బీపీఎల్‌ కథ ఇది..

 

Trophy Shoot | BPL T20 2024🏆#BPL | #cricketlovers pic.twitter.com/iMKn8t7aOJ

— BPL Bangladesh Premier League (@BPLofficialT20) January 17, 2024

పదో సీజన్‌గా జరుగబోతున్న బీపీఎల్‌ జనవరి 19 నుంచి మొదలై మార్చి 1 దాకా సాగనుంది. ఏడు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలోనూ పాకిస్తాన్‌ ప్లేయర్‌ బాబర్‌ ఆజమ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లున్నారు. ఖుల్నా టైగర్స్‌, దుర్దంతొ ఢాకా, కొమిలియా విక్టోరియన్స్‌, చత్తోగ్రమ్‌ ఛాలెంజర్స్‌, సిహ్లట్‌ స్ట్రైకర్స్‌, ఫార్చ్యూన్‌ బారిస్హల్‌, రంగాపూర్‌ రైడర్స్‌ లు తలపడనున్నాయి. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఎస్‌ఎ 20, ఐఎల్‌ టీ20 ముగిశాక పలువురు ఆటగాళ్లు బీపీఎల్‌లో తమ తమ ఫ్రాంచైజీలకు ఆడనున్నారు. భారత్‌లో బీపీఎల్‌ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో లేవు. ఫ్యాన్‌కోడ్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో డబ్బులు చెల్లించి మ్యాచ్‌లను వీక్షించొచ్చు.

Previous article

KTR | త్వరలోనే ఎమ్మెల్సీలతో కేసీఆర్‌ భేటీ : కేటీఆర్‌

Next article



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.