ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్‌ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. నిర్మాణ పనుల్లో భాగంగా కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ కుప్పకూలింది. కార్మికులు అప్రమత్తమై బ్రిడ్జిపై నుంచి దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.
Also Read.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హాఫ్ హాలిడే
ఈ ప్రమాదంలో 10మందికిపైగా కార్మికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
The post ఖమ్మం జిల్లాలో కుప్పకూలిన బ్రిడ్జి. 10 మందికి గాయాలు! appeared first on tnewstelugu.com.
