హైదరాబాద్: తొలిసారి హైదరాబాద్ లో ఒక నిందితుడికి ఉరిశిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
Also Read.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో.. ప్రజలకు ఇప్పటికే అర్థమైంది
వివరాల్లోకి వెళితే.. 2018లో భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఇంజామ్ హక్.. తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసు విచారణలో అదనపు కట్నం కోసమే తన భార్యను ఇంజామ్ హత్య చేశాడని తేలింది. ఈ కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
