హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసినట్టు ఏసీబీ తెలిపింది. కానిస్టేబుల్స్ రెండు కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్లు చూపి బెదిరింపులకు పాల్పడ్డారని ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. అరెస్టు చేయకుండా ఉండేందుకు రూ.5లక్షలు డిమాండ్ చేశారని వెంకటరమణ అనే బాధితుడు తమను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
Also Read.. రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు?
ఇప్పటికే బాధితుడు విడుతల వారీగా రూ.3లక్షలు చెల్లించాడని పేర్కొన్నారు. పీఎస్ లో గురువారం జరిపిన సోదాల్లో ఆధారాలు లభించడంతో కానిస్టేబుల్ మల్లేశం, హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, కోర్టు కానిస్టేబుల్ నరేందర్‌తో పాటు మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఆయన వివరించారు.
The post చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు కానిస్టేబుల్స్ అరెస్ట్ appeared first on tnewstelugu.com.
