నేడు తెలంగాణ భవన్ లో జరిగిన మెదక్ పార్లమెంటరి సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలని ప్రస్తావించి ఎండగట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రియాంక గాంధీ ఏమో నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్తే.. బట్టి మాత్రం అది తమ మేనిఫెస్టేలో లేదని అసెంబ్లీలో అబద్దం చెప్పారని అన్నారు కేటీఆర్.
ఇక గవర్నర్ తో కాంగ్రెస్ పచ్చి అబద్దాలు చదివించింది. తెలంగాణ దివాళా తీసిందని, అప్పులకుప్ప అయిందని గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు ఆడించిందని అందుకే తమ బాధ్యతగా స్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. అప్పులు మాత్రమే కాదు ఆస్తుల లెక్కలు కూడా మేము తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదు.. మొత్తం లెక్క తీస్తే 420 హామీలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. దీనిని ఎండగట్టే బాధ్యత మనందరి మీద ఉందన్నారు కేటీఆర్.
The post అసెంబ్లీలో బట్టి పచ్చి అబద్దాలు..! appeared first on tnewstelugu.com.
