హైదరాబాద్ లోని పలు పబ్ లపై కేసులు నమోదైయ్యాయి. భారీ డీజే సౌండ్లతో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయంటూ పబ్ లపై ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్ లోని 6 పబ్ లలో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. క్లబ్ రోగ్, పోర్ట్ పబ్, హలో కాక్ టెయిల్, ఫ్యాట్ పీజియన్, జీరో 40 పబ్ లతో పాటు మరో పబ్ కూడా నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ తో చుట్టుపక్కల వారికి ఇబ్బందులు కలుగజేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదైన ఆరు పబ్ లు మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: షాపింగ్‌కు వెళ్లి వచ్చేసరికి.. 35 తులాల బంగారం చోరీ
