హైదరాబాద్ : ఈనెల 22వ తేదీన అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. ఈ మేరకు ఆహ్వానం పంపించారు.
Also Read.. మెదక్ అభ్యర్థి ఎవరైనా.. గెలుపు బీఆర్ఎస్ దే
దేశవ్యాప్తంగా ప్రముఖులందరిని ఆలయ ప్రారంభోత్సవానికి ట్రస్ట్ ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు కూడా ఆహ్వానించారు. కాగా, కేసీఆర్ కు ఇటీవలే తుంటి ఎముక ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
The post అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి కేసీఆర్‌కు ఆహ్వానం appeared first on tnewstelugu.com.
