న్యూఢిల్లీ: 71వ ప్రపంచ సుందరి పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లే అధికారికంగా ప్రకటించారు. తన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
Also Read.. గురుకుల అగ్రికల్చర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 24న కౌన్సిలింగ్
మిస్ వరల్డ్ ఆతిథ్య దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదిక కానుంది. చివరిగా 1996లో బెంగళూరులో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు.
Also Read.. జీతం విషయంలో యజమానితో వాగ్వాదం. ఉద్యోగి ఆత్మహత్య
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు భారత్ మండపం, ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో మిస్ వరల్డ్ పోటీలు ఉంటాయి. ఫైనల్స్ ముంబయిలో జరుగుతాయి. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
