న్యూఢిల్లీ : 2005లో లాంఛ్ అయి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్నది యూట్యూబ్. ప్రపంచంలో దాని గురించి తెలియని వారుండరు. ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో అది రారాజుగా వెలుగొందుతోంది. మరోవైపు లక్షలాది కంటెంట్ క్రియేటర్లకు ఆదాయ వనరుగా యూట్యూబ్ మారి వారి ఎదుగుదలకూ తోడ్పడుతోంది.
Also Read.. సలార్ ఓటిటీ విడుదలపై కొత్త వివాదం..!
సబ్స్క్రైబర్ల పరంగా యూట్యూబ్లో ఉన్న టాప్ టెన్ ఛానెల్స్ వివరాలను ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రకటించింది. భారత్కు చెందిన టీ సిరీస్ అత్యధిక సబ్స్క్రైబర్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంది. టాప్ టెన్ జాబితాలో ఇండియాకు చెందిన మరో రెండు ఛానెల్స్ కూడా స్థానం సంపాదించాయి.
టాప్ టెన్ ఛానెల్స్:
టి సిరీస్ 25.7 కోట్ల సబ్స్క్రైబర్లు
మిస్టర్ బీస్ట్ 23.2 కోట్లు
కోకోమెలన్ 17 కోట్లు
సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ 16.7 కోట్లు
కిడ్స్ డయానా షో 11.8 కోట్లు
ప్యూడైపీ 11.1 కోట్లు
లైక్ నాస్త్యా 11 కోట్లు
వ్లాద్ అండ్ నికీ 10.8 కోట్లు
జీ మ్యూజిక్ కంపెనీ 10.4 కోట్లు
డబ్ల్యూడబ్ల్యూఈ 9.9 కోట్లు
The post యూట్యూబ్లో టాప్ టెన్ ఛానెల్స్. ఇండియాదే నెంబర్ వన్! appeared first on tnewstelugu.com.
