నేడు నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ఆరో తరగతిలో చేరేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. పరీక్ష సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 204-25విద్యాసంవత్సరానికి గాను ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు. ఉదయం 10గంటల కేంద్రాలకు చేరుకోవాలని..10.45గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు పరీక్ష జరుగుతుందని ఆధార్ కార్డు, ఏదైనా ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి : 28 ఏళ్ల తర్వాత భారత్లో అందాల పోటీలు
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి 4458మంది విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 983మంది విద్యార్థులకు 4పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి 1208 మంది దరఖాస్తు చేసుకోగా…ఆరు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. మంచిర్యాల జిల్లా నుంచి 1188 మంది విద్యార్థులకు ఏడు పరీక్షా కేంద్రాలు, కుమ్రం భీ అసిఫాబాద్ జిల్లా నుంచి 1079 మందికి ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల 144సెక్షన్ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు జవహర్ నవోదయ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు.
