జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రాముడి కోసం ఆభరణాలు, కానుకలు, ప్రసాదాలు అయోధ్యకు చేరుతున్నాయి. భక్తులందరూ రామనామంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి టీచర్ రాముడి భజనకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#WATCH | Nagpur, Maharashtra: School students dance on Shri Ram bhajans ahead of the Shri Ram Janmabhoomi Temple Pran Pratishtha ceremony. pic.twitter.com/nMmAX718fl
— ANI (@ANI) January 20, 2024
నాగ్‌పూర్‌లోని బాబా నానక్ సింధీ హిందీ విద్యాలయంలో కాజల్ అనే యువతి ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తోంది. అయితే మరో రెండు రోజుల్లో అయోధ్యలో జరిగే రాముడి ప్రాణ ప్రతిష్టకు ఆమె తన వంతుగా భక్తిని చాటుకుంది. తమ స్కూల్ నుంచే విద్యార్థులతో కలిసి రామ భజన చేస్తూ డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది.
‘రామ్ ఆయేగే’ అంటూ రిథమిక్ పాటకు విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను కాజల్ అసుదానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాజల్ ఆకుపచ్చ చీరను ధరించగా.. విద్యార్థులు పాఠశాల యూనిఫారాలను ధరించి పాఠశాల ప్రాంగణంలో అద్భుతమైన ప్రదర్శనను చేశారు. గతంలో విద్యార్థులతో కలిసి అనేక డ్యాన్స్‌లు చేసి ఇప్పటికే సోషల్ మీడియా స్టార్ అయిన కాజల్ మరోసారి ఈ డ్యాన్స్‌తో హైలైట్ అయింది.
