హైదరాబాద్: రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని, ప్రజలు ఏక పక్షంగా బీఆర్ఎస్ కు మద్దుతుగా తీర్పు ఇచ్చారని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజక వర్గాల సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో శనివారం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు మంచి సూచనలు చేశారని తెలిపారు.
Also Read.. ఈనెల 22న తెలంగాణలో సెలవు ప్రకటించాలి. హైకోర్టులో పిల్
సికింద్రాబాద్ ఎంపీ సీట్ పరిధిలో అసెంబ్లీ ఓట్ల ఆధారంగా చూస్తే బీఆర్ఎస్ భారీ ఆధిక్యంలో ఉందని, ఇదే ఓటింగ్ సరళి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోందని, తాము రేషన్ కార్డుల కోసం ప్రజలను లైన్ లో నిలబెట్టలేదని స్పష్టం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను లైన్లో నిలబెట్టిందని విమర్శించారు.
Also Read.. మామిడి పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురు మృతి
కొత్త రేషన్ కార్డులు ఇస్తుందో లేదో తెలియదన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పంచుతుంటే తులం బంగారం ఏమైందని లబ్ధిదారులు అడుగుతున్నారని అన్నారు. కేటీఆర్ ఓపిగ్గా కార్యకర్తల అభిప్రాయాలు వింటున్నారని, కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. ఇలాంటి చర్చలు పార్టీలో చాలా అవసరమన్నారు. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓ పార్టీని బొంద పెట్టడం ఎవరి తరం కాదని, ఇలాంటి వ్యాఖ్యలు సీఎం పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడదని హితవు పలికారు.
The post రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారు appeared first on tnewstelugu.com.
