
వికారాబాద్ : అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
846829
