హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టులు తయారు ముఠాను తెలంగాణ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, కోరుట్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 12 మంది సభ్యుల గల ముఠాను అదుపులోకి తీసుకొని వారివద్ద నుంచి 15 సెల్‌ఫోన్లు, 5 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Also Read.. రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారు
విదేశీయులకు పాస్‌పోర్టులు వచ్చేందుకు అవసరమైన నకిలీ ఆధార్ కార్డు, ఓటరు కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేస్తోందన్నారు. వీటి సాయంతో ఇప్పటికే వందల మంది విదేశీయులు, నిందితులు పాస్‌పోర్టులు పోందినట్లు గుర్తించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరితోపాటు మరో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
