హైదరాబాద్ : అయోధ్య రాముడికి పోచంపల్లి నుంచి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అయోధ్య రాముడికి సమర్పించనున్న పోచంపల్లి పట్టువస్త్రాలను మగ్గంపై తయారీని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. శనివారం సనత్ నగర్లోని హనుమాన్ దేవాలయంలో పద్మశాలీసంఘం ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమంలో శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాల తయారీని ఆయన ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీన పట్టువస్త్రాలను అయోధ్యకు తీసుకెళ్లి, ఆలయ పూజారులకు సమర్పించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
Also Read.. భర్త అనుమతి లేకుండానే సానియా విడాకులు.. వివాదంపై తండ్రి క్లారిటీ
