హైదరాబాద్: వరుస దాడంలతో నకిలీ మందుల ఆటకట్టిస్తున్న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్‌ను (TDCA) కృషిని ఇంటర్ పోల్ అభినందించింది. ఈ మేరకు టీడీసీఏకు ఇంటర్‌పోల్ లేఖ రాసింది. నకిలీ మందులు ప్రజారోగ్యానికి పెను ముప్పని, నకిలీ మందులు వ్యాధిని నయం చేయడంలో విఫలం కావడమే కాకుండా రోగికి వినాశకరమైన పరిణామాలను కలుగజేస్తాయని అందులో పేర్కొంది. నకిలీ మందులు గుర్తించడం కష్టమని, అవి నిజమైన ఉత్పత్తులకు సమానంగా కనిపించేలా తయారు చేస్తారన్నారు. తెలంగాణ DCAఅధికారులు మార్కెట్‌లో నకిలీ డ్రగ్స్ తరలింపు , తయారీని గుర్తించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని అభినందించారు.
Also Read.. మెగా ఫ్యాన్స్ కి శుభవార్త.. చిరంజీవి బయోపిక్ అధికారిక ప్రకటన
తెలంగాణ రాష్ట్రాన్ని నకిలీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ఇంటర్ పోల్ ప్రశంసలు కురిపించింది. ఇటీవల సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరిస్‌టోర్మికల్ ఫార్మా వంటి ప్రఖ్యాత కంపెనీల పేర్లతో ఫేక్ మెడిసిన్ డ్రగ్స్ రాకెట్ పే ఛేదించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. నకిలీ యాంటీబయాటిక్స్, హైపర్‌టెన్షన్, కొలెస్ట్రాల్ మందులను స్వాధీనం చేసుకున్న విషయాన్ని పేర్కొంది.
Also Read.. పెట్టుబడుల డీల్స్ అన్నీ బోగస్.. రేవంత్ పై దాసోజు శ్రవణ్ లెఫ్ట్ రైట్
డిసెంబర్ లో ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ నుండి కొరియర్ ద్వారా హైదరాబాద్ కు రవాణా అయిన ఫేక్ కంపెనీ నకిలీ ఇరవై ఆరు లక్షల విలువైన మెడికల్ స్టాక్‌లను డీసీఏ సీజ్ చేసింది. జనవరి 3న తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుండి కొరియర్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నకిలీ యాంటీబయాటిక్స్ మెడిసిన్ రాకెట్‌ను చేధించింది. రూ.లక్ష విలువైన నకిలీ యాంటీబయాటిక్స్‌ను డీసీఏ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన దాడుల్లో రూ.22.95 లక్షలు మెడిసిన్ సీజ్ చేసింది. నకిలీ డ్రగ్స్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాలలో నకిలీ మందులను అరికట్టడానికి ఇంటర్‌పోల్ కృషి చేస్తోంది.
