బీసీల సమస్యల పరిష్కారం చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఫిబ్రవరి 2,3,4 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జనగణనలో ఓ బీసీ సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీలకు మహిళా సబ్ కోటా కల్పించాలనే డిమాండ్లతోనే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ ఓబీసీ అయినా, ఓబీసీ డిమాండ్లను పరిష్కరించలేదని మండిపడ్డారు. బీసీల పట్ల మోదీ, బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపిస్తోందో ఎండగట్టేందుకే ఢిల్లీకి తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: కొమురవెల్లి మల్లన భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం..!!
