ఈనెల 22న అయోధ్యలోని రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. రేపు నిర్వహించే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 4వేలకుపైగా వీఐపీలతోపాటు సామాన్య భక్తులు కూడా దర్శించుకునేందుకు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈనేపథ్యంలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత ఆహారాన్ని అందించేందుకు వీలుగా సామాజిక వంటకాశాలలు ఏర్పాటు చేశారు. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ వంటి సంస్థలు ఈ ఏర్పాట్లను చేశాయి. రాంకీరసోయ్ నుంచి లంగర్ వరకు వంటశాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతివీధిలో వీటిని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: రూ.500 కోసం గొడవ పడి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు!
కిచిడీ, ఆలూపూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్ లు భక్తులకు అందించనున్నాయి. ప్రస్తుతం చలి తీవ్రత అధికంగా ఉండటంతో వేడి టీని భక్తులను అందించనున్నారు. బాబా హర్జీత్ సింగ్ రసూల్ పుర్ నేత్రుత్వంలో నిహాంగ్ సిక్కుల గ్రూపు శుక్రవారం అయోధ్యాకు చేరుకుంది. చార్ దామ్ మఠ్ లో వారు 2నెలలపాటు లంగర్ ను ఏర్పాటు చేసి ఆహారాన్ని అందించనున్నారు. పాట్నాకు చెందిన మహావీర్ ఆలయ ట్రస్టు రోజుకు పదివేల మందికి ఆహారాన్ని అందించే విధంగా రాంకీ రసోయ్ వంట గదిని సిద్ధం చేసింది. ఇస్కాన్ మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. రోజుకు ఐదువేల మందికి ఆహారాన్ని అందించనుంది.
