అయోధ్యలో సోమవారం జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత రాష్ట్ర సమితికి అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఆదివారం వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను ఆహ్వానించినట్లు బీజేపీ చేస్తున్న వాదనలపై కవిత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు బీఆర్ఎస్ కి అధికారిక ఆహ్వానం అందలేదు. అయితే శ్రీరాముడు ఒక పార్టీకో, సంస్థకో చెందినవాడు కాదు రాముడు అందరివాడు’ అని ఆమె గుర్తు చేశారు. అయితే ప్రతిఒక్కరు దేవస్థానాల్ని సందర్శిస్తారని.. ఇప్పుడు వెళ్లకున్నా మేము త్వరలో అయోధ్యని సందర్శిస్తానని అన్నారు కవిత.
The post అయోధ్యకి ఆహ్వానం అందలేదు.. అయినా అప్పుడు వెళ్తాం..! appeared first on tnewstelugu.com.
