బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని, మళ్ళీ మంచి రోజులు వస్తాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడయాతో మాట్లాడారు. ‘ఈ నెల 24న కేటీఆర్ కరీంనగర్లో పర్యటించనున్నారు. నాలుగోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి కరీంనగర్ ప్రజలు సరికొత్త రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలు, బండి సంజయ్ సెంటిమెంట్.. కాదని నన్ను గెలిపించారు. బీఆర్ఎస్ మన ఇంటి పార్టీ.. గతం గతః. భవిష్యత్ పై దృష్టిసారిద్దాం.. పార్టీని మరింత బలోపేతం చేసుకుందాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కలిసి కట్టుగా పోరాడుదాం. డిసెంబర్ 9 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీ ఏమైంది. పంట చివరి దశకు వచ్చినా సాగు నీరు ఇవ్వడం లేదు. వరి పంట వద్దు… ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోండి అన్న మంత్రి పొన్నం ప్రభాకర్… మీరు వరి పంటకు బోనస్ ఎలా ఇస్తారు. రైతుబంధు కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దు… మళ్ళీ మంచి రోజులు వస్తాయి. కార్యకర్తలను ఇబ్బంది పెడితే ధీటుగా ఎదుర్కొంటాం. రాష్ట్రమంతటా కాంగ్రెసు గాలి వీచినా… కరీంనగర్లో ఆ ప్రభావం కనిపించలేదు’ అని ఎమ్మెల్యే గంగుల అన్నారు.
Read Also: రేవంత్ రెడ్డి చెప్పేది ఒక్కటి.. చేసేది ఇంకొక్కటి
The post కార్యకర్తలు అధైర్యపడొద్దు… మళ్ళీ మంచి రోజులొస్తాయి appeared first on tnewstelugu.com.
