బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిలు కలిసి కుట్ర పన్నుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. అయితే బీఆర్‌ఎస్ మోదీకి గానీ, రేవంత్‌రెడ్డికి గానీ భయపడేది లేదని, తెలంగాణ ప్రజల గొంతుకగా పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాల సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సభ్యులను ఉద్దేశించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని మోదీని కలిశారు. ఆ సమావేశంలో బీఆర్‌ఎస్‌ను కతం చేసేందుకు పూర్తిగా సహకరిస్తానని మోడీ ముఖ్యమంత్రితో చెప్పినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఎన్నికల కోసం తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీలు కలిసిపోయాయి. ఇక నేను కరెంట్ బిల్లులు కట్టొద్దని ప్రజలని రెచ్చగొడుతున్నానంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నాడు. నేను వారు ఇచ్చిన హామీలనే గుర్తుచేస్తున్న. స్వయంగా రేవంత్ రెడ్డే చెప్పారు. కరెంట్ బిల్లులు ఎవ్వరు కట్టోద్దు. డిసెంబర్ నుండి బిల్లులు మాఫీ చేస్తామని.. డిసెంబర్ 9 నుండే ఈ పథకం అమలులోకి వస్తుందన్నారు. సమయం చెప్పి నెలన్నర అవుతుంది. అందుకే మీ హామీలనే మేము గుర్తుచేస్తున్నాం. మీ దొంగ హామీలను నమ్మి ప్రజలు ఓటేశారు. వారికోసం ప్రశ్నించే బాధ్యత మాకుంటుంది’ అని భట్టికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
