మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు లేదా డ్యాన్స్ వీడియోలతో మనకు సితార ఘట్టమనేని నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది. తండ్రి ఎంత సిగ్గు పడే వ్యక్తిత్వమో దానికి కూతురు మాత్రం పూర్తిగా విరుద్ధం. ఒక్క సినిమా విడుదల కాకుండానే సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల ముద్దుల కూతురు సితారకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చేసింది.
ఇటీవల తన తండ్రి గుంటూరు కారం సినిమా చూడటానికి స్నేహితులతో కలిసి సుదర్శన్ థియేటర్‌ని సందర్శించిన సితార తరువాత జరిగిన ‘గుంటూరు కారం’ సక్సెస్ పార్టీ సందర్భంగా కూడా కనిపించింది. ఇలా గుంటూరు కారం మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్న సితార తాజాగా ఒక డ్యాన్స్ వీడియోని వదిలింది. ఈ వీడియోలో గుంటూరు కారం హిట్ సాంగ్ ‘ఓ మై బేబీ’కి అద్భుతంగా డ్యాన్స్ చేసింది.
తెల్లటి కుర్తా ధరించి, సితార గుంటూరు కారం హిట్ ట్రాక్‌కి చక్కగా డ్యాన్స్ చేసింది. సినిమాలో శ్రీలీల మహేష్ బాబుపై మూర్ఛపోతుండగా వచ్చే సిచువేషన్ లో ట్రిప్పింగ్, ట్రిప్పింగ్ అనే ఈ సాంగ్ వస్తుంది. అందులో శ్రీలీల వేసిన స్టెప్స్ ని సితార సైతం సునాయాసంగా చేసి ఫ్యాన్స్ తో వావ్ అనిపించుకుంటుంది.
