పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు మాజీ యంపి వినోద్ కుమార్ కీలక సూచనలు చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ ది..మాజీ సిఎం కెసిఆర్ ది. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిఆర్ఎస్ పెట్టుకున్నామే తప్ప పదవుల కోసం కాదు. కెసిఆర్ కరీంనగర్ షిఫ్ట్ అవుతున్నారు… రాబోయే రోజుల్లో ఇక్కడే ఉండబోతున్నారు. ఆది నుంచి కరీంనగర్ కే సి ఆర్ కు అండగా నిలిచింది. అబద్దాల పునాదుల పై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ వి ఆచరణకు సాధ్యం కాని హామీలు కళ్యాణ లక్ష్మి దరఖాస్తుల స్వీకరణ బంద్ చేశారు.
వరికి 5 వందల బోనస్ అన్నారు.. ఎప్పుడు ఇస్తారు. మహాలక్ష్మి పథక విధి విధానాలు ఏంటో చెప్పాలి… ఆడబిడ్డలను మోసం చేయొద్దు. వంద రోజుల తర్వాత హామీలు అమలు చేయండి… కానీ ముందు జీఓలు విడుదల చేయండి .పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ పేరుతో తప్పించుకోవద్దు. 10 సంవత్సరాల మోడీ పాలన… ఎంపిలుగా నేను… బండి సంజయ్ చేసిన అభివృద్ధి పై చర్చ జరగాలి. బండి సంజయ్ ఐదేళ్ళలో ఐదు రూపాయలు తేలేదు. తెలంగాణలో వసూలు చేసిన సెస్ డబ్బులతో ఆర్ఓబి నిర్మిస్తున్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు ఫెయిల్. కెసిఆర్ పై ఏది పడితే అది మాట్లాడొద్దు’ అని అన్నారు వినోద్ కుమార్.
