న్యూఢిల్లీ: జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌తో విలీన ఒప్పందాన్ని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (ఇప్పుడు కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్) రద్దు చేసుకుంది. ఈ విలీన ప్రక్రియకు ముందుగా నిర్ణయించిన గడువు జనవరి 21తో ముగిసింది. ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ.83,000 కోట్ల) విలీనం ప్రక్రియ అర్ధాంతంరంగా నిలిచిపోయింది.
Also Read.. ఆర్జీవీకి తెలంగాణ హైకోర్టు షాక్..!
2021లో విలీన ఒప్పందంపై జీ – సోనీ సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు 2 ఏళ్ల సమయాన్ని నిర్దేశించుకున్నాయి. ఈ గడువు 2023 డిసెంబరు 21తో ముగిసింది. అయితే, తుది గడువును ఒకనెల పాటు(జనవరి 21వరకు) పొడిగించారు. ఈ విలీన ఒప్పందానికి సీసీఐ, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ, వాటాదారుల ఆమోదం పొందింది.
Also Read.. అయోధ్యలో సిద్దిపేట వాసుల అన్నదానం
అయితే, 2021లో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కొత్తగా ఏర్పాటయ్యే విలీన సంస్థ జీ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా ఆధ్వర్యంలో కార్యాకలపాలు జరగాలి. కానీ నిధుల మళ్లింపు కేసులో కీలక పదవులు చేపట్టవద్దని పునీత్‌పై సెబీ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో అధికార మార్పిడి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విలీనం రద్దయినట్లు తెలుస్తోంది.
