రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కన్న తండ్రిని కొడుకు, కోడలు హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న రాత్రి కొడుకు, కోడలు కలిసి తండ్రి నిద్రిస్తున్న సమయంలో ముఖానికి దిండుతో కప్పి హత్య చేశారు.
ఎకరం భూమి కోసమే హత్య చేశారన్నారు. యాచారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులు కర్రె ఎంకటయ్య (49 ఏళ్లు), కర్రె మంగమ్మ (43 ఏళ్లు) వారి కుమార్తె, కుమారుడిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
