ఢిల్లీ ఎన్సీఆర్ లో మరోసారి భూ ప్రకంపనలు భయభ్రాంతులకు గురిచేశాయి. చైనాలోని దక్షిణ జిన్ జియాంగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 7.2తీవ్రతతో భూకంపం సంభవించింది. అనంతరం ఢిల్లీ ఎన్సీఆర్ లోనూ సోమవారం అర్ధరాత్రి ప్రకంపంనలు వచ్చాయి. నివేదికల ప్రకారం..చైనాలోని దక్షిణ జిన్ జియాంగ్ లో భూకంప కేంద్రం ఉందని..రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా ఉందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
ఇది కూడా చదవండి: ఆకాశంలో ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్..ఫ్లైట్ లో 160 మంది ప్రయాణికులు..!!
భూమికంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ప్రాణాలు చేతిలో పట్టుకుని వణికిపోయారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ ఎన్సీఆర్ లో పలుమార్లు భూమి కంపించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా భూమికంపించింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అంతకుముందు 6.1 తీవ్రతతో అప్ఘనిస్తాన్ లో భూమి కంపించడంతో ఢిల్లీ, ఉత్తరభారతంలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి.
