ముంబై: బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి సైఫ్ ఇంటికి వెళ్లారు. అయితే, గాయాలవడం తమ వృత్తిలో భాగమని సోషల్ మీడియా అకౌంట్లో సైఫ్ పేర్కొన్నారు. నిపుణుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని చెప్పారు. తనపై ప్రేమ కురిపించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లో దేవర షూటింగ్ చిత్రీకరణ సమయంలో సైఫ్ అలీఖాన్ కు గాయం కాగా, ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
Also Read.. ఉప్పల్ స్టేడియంలో టీమిండియా నెట్స్ ప్రాక్టీస్
