ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు. బీటెక్ చదివిన ఓ అమ్మాయి ఉద్యోగం కోసం ఎవరి దగ్గరో చేయిచాచ కుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకుంది. అందులో పానీపూరీ తోపుడుబండిని ఏర్పాటుచేసుకుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా దేశవ్యాప్తంగా 40కి పైగా పానీపూరీ తోపుడుబండ్లను ఏర్పాటుచేసింది. ఈ అమ్మాయి మొదట తన తోపుడు బండిని స్కూటీకి కట్టి లాక్కొచ్చేది. అయితే ఈ విషయం తెలిసిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తన పెద్ద మనసు చాటుకున్నాడు. తన కంపెనీకి చెందిన మహీంద్రా థార్ జీప్ ను ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
What are off-road vehicles meant to do?
Help people go places they haven’t been able to before..
Help people explore the impossible..
And in particular we want OUR cars to help people Rise & live their dreams..
Now you know why I love this video…. pic.twitter.com/s96PU543jT
— anand mahindra (@anandmahindra) January 23, 2024
అసాధ్యమైన వాటిని అన్వేషించడంలో సహాయపడాలని ఆయన సూచించారు. ముఖ్యంగా తమ కార్లు ప్రజలు ఎదగడానికి మరియు వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయపడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Read Also: రైతుబంధు రాలేదన్న రైతు మీద కేసు పెట్టిన కాంగ్రెస్ నాయకులు
The post బీటెక్ పానీపూరి వాలీకి జీప్ గిఫ్ట్‌గా ఇచ్చిన ఆనంద్ మహీంద్ర.. వైరల్ వీడియో appeared first on tnewstelugu.com.
