Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

Australia Open 2024: అయ్యో అల్కరాజ్‌.. ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారీ షాక్‌.. సెమీస్‌కు జ్వెరెవ్‌..

TelanganapressBy TelanganapressJanuary 24, 2024No Comments

Fotojet (6)

Australia Open 2024: స్పెయిన్‌ యువ సంచలనం, గతేడాది వింబూల్డన్‌ ట్రోఫీ నెగ్గి భావి టెన్నిస్‌ తారగా ఎదుగుతున్న కార్లోస్‌ అల్కరాజ్‌కు భారీ షాక్‌. మెల్‌బోర్న్‌ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో అల్కరాజ్‌.. క్వార్టర్స్‌లోనే ఇంటిబాటపట్టాడు. రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా బుధవారం ముగిసిన పురుషుల క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ అల్కరాజ్‌.. 1-6, 3-6,7-6 (7-2), 4-6 తేడాతో ఆరో సీడ్‌ జర్మన్‌ ప్లేయర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో ఓడిపోయాడు.

తొలి రెండు సెట్లు కోల్పోయినా మూడో రౌండ్‌లో పుంజుకున్న అల్కరాజ్‌.. నాలుగో సెట్‌లో మళ్లీ తడబడి పరాభవాన్ని మూటగట్టుకున్నాడు. 3 గంటల 6 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో జ్వెరెవ్‌ ఆదినుంచే దూకుడుగా ఆడాడు. ఈ మ్యాచ్‌కు ముందువరకూ జ్వెరెవ్‌కు టాప్‌ – 5 సీడ్‌ ఆటగాళ్లతో పది మ్యాచ్‌లు ఆడితే అందులో ఒక్కటి కూడా గెలవలేదు. కానీ తాజాగా అల్కరాజ్‌ను ఓడించడం విశేషం. సెమీస్‌లో జ్వెరెవ్‌.. మూడో సీడ్‌ రష్యన్‌ ప్లేయర్‌ డేనియల్‌ మెద్వెదెవ్‌తో తలపడతాడు.

 

The stars align for Sascha in Melbourne ✨@AlexZverev returns to the AO semifinals and is one step closer to a maiden Grand Slam trophy ✨@wwos • @espn • @eurosport • @wowowtennis pic.twitter.com/WLYySu0iYz

— #AusOpen (@AustralianOpen) January 24, 2024

సెమీస్‌లోకి మెద్వెదెవ్‌..

మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌.. 7-6 (7-4), 2-6, 6-3, 5-7, 6-4 తేడాతో తొమ్మిదో సీడ్‌ హుర్కాక్జ్‌ను ఓడించాడు. ఇద్దరిమధ్యా హోరాహోరిగా సాగిన ఈ పోరులో తొలి సెట్‌లో మెద్వెదెవ్‌ నెగ్గగా.. రెండో సెట్‌ను ప్రత్యర్థికి అప్పగించాడు. మళ్లీ మూడో సెట్‌లో మెద్వెదెవ్‌ గెలవగా నాలుగో సెట్‌ను హుర్కాక్జ్‌ గెలవడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. మెద్వెదెవ్‌ ఆఖరి సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు.

 

Four superstars. One trophy. Choose your champion 🏆 🤔 pic.twitter.com/qCCUsXmoVz

— #AusOpen (@AustralianOpen) January 24, 2024

ఫైనల్‌-4 బెర్తులు ఖరారు..

 

The path to Grand Slam glory leads here 👑 👀 Who you got? pic.twitter.com/zTwerfh6Fu

— #AusOpen (@AustralianOpen) January 24, 2024

అల్కరాజ్‌ – జ్వెరెవ్‌ల పోరుతో క్వార్టర్స్‌ మ్యాచ్‌లు ముగిశాయి. పురుషుల సెమీస్‌లో శుక్రవారం (జనవరి 26) టాప్‌సీడ్‌ జొకోవిచ్‌.. ఇటలీ ప్లేయర్‌, నాలుగో సీడ్‌ సిన్నర్‌ను ఢీకొననుడన్నాడు. మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌తో జ్వెరెవ్‌ ఢీకొంటాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా సంచలనం కోకో గాఫ్‌తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అరీనా సబలెంకతో అమీతుమీ తేల్చుకోనుంది. మరో పోరులో ఉక్రెయిన్‌ ప్లేయర్‌, అన్‌సీడెడ్‌ డయానా యస్త్రమెస్కతో చైనా సంచలనం 12వ సీడ్‌ కెన్విన్‌ జెంగ్‌తో ఢీకొననుంది.



Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.