హైకోర్టుకు రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో భూములు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు కొన్ని రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. GO-55ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులు ధర్నాలో పాల్గొన్నారు. హైకోర్టుకు మంజూరు చేసిన భూములను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు.
Read Also: జనసేనలో చేరిన జానీ మాస్టర్.. నెల్లూరు నుంచి పోటీకి సై!
అయితే ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దు.. జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్దినిని పోలీసులు జుట్టు లాగి పడేశారు. స్కూటీపై వచ్చిన మహిళా పోలీసులు విద్యార్థినిని జుట్టు పట్టి లాగారు. దాంతో ఆ విద్యార్థిని కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు.. కీలుబొమ్మల్లా మారారని విమర్శిస్తున్నారు.
