టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ మాసానికి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్ లైన్ ద్వారా చేపట్టింది. శ్రీవారి ఆర్జిత సేవలు, లక్కీడీప్ , వ్రుద్ధులు, దివ్యాంగులు, శ్రీవాణి ట్రస్టు,రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈనెల 18 నుంచి బుధవారం వరకు జారీ చేసింది. దీనిలో భాగంగానే ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసిన రూ. 300ప్రత్యేక ప్రవేశ దర్శనం టీకెట్లను భక్తులు 2గంటల 45నిమిషాల్లోనే కొనుగోలు చేశారు.
ఇది కూడా చదవండి: అవన్నీ పుకార్లే..కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తా:సునీత లక్ష్మారెడ్డి.
