వృద్ధాప్యంలో ఉన్న అత్త సంరక్షణపై ఝార్ఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆమె సంరక్షణ బాధ్యతను చూసుకోవాల్సింది కోడలేనని, అది మన సంస్కృతీ సంప్రదాయాల్లోనే ఉందని తెలిపింది. ఓ విడాకుల కేసు సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వృద్ధులైన అత్తమామలు, లేదా అమ్మమ్మకు సేవ చేయడం స్త్రీ బాధ్యత అని చెప్పింది. అదొక సాంస్కృతిక ధర్మమంది. వారి నుంచి విడిపోయి వేరుగా కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని జస్టిస్ సుభాష్‌చంద్ స్పష్టం చేశారు. అంతేకాదు, ఎలాంటి కారణం లేకుండా భర్త నుంచి విడిపోయినట్టయితే మనోవర్తి పొందేహక్కు భార్యకు ఉండదని పేర్కొన్నారు.
విడాకుల కేసును విచారించిన దుమ్కాలోని కుటుంబ న్యాయస్థానం భార్యకు రూ.30 వేలు, కుమారుడికి రూ. 15 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది. భర్త దీనిని ఝర్ఖండ్ హైకోర్టులో సవాలు చేశారు. విచారించిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు, ఈ సందర్భంగా కుటుంబంలోని మహిళ ప్రాముఖ్యాన్ని చెబుతూ మన సంస్మృతిలోని విషయాలను ప్రస్తావించింది కోర్టు.
ఇది కూడా చదవండి: డేటింగ్ నిజమే..కానీ అతనితో కాదు..బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా..!!
