పంటలకు కనీస మద్దతు ధర సహా అనేక జాతీయ సమస్యలపై ఫిబ్రవరి 16న ‘భారత్ బంద్’ నిర్వహిస్తున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. రైతు సంఘాలతోపాటు వ్యాపారులు, రవాణా సంస్థలను కూడా మద్దతు కోరినట్టు తెలిపారు.
ఈ సమ్మెలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సహా పలు రైతు సంఘాలు పాల్గొంటాయని రాకేశ్ టికాయత్ తెలిపారు. ఆ రోజున రైతులు తమ పొలాలకు వెళ్లరని తెలిపారు. దేశానికి ఇది పెద్ద సందేశం కావాలన్నారు. బంద్ రోజున వ్యాపారులు కొనుగోళ్లు జరపవద్దని,షాపులు మూసివేయాలని కోరారు టికాయత్.
కనీస మద్దతు ధర లేకపోవడం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ పథకం వంటివి దేశానికి సమస్యగా మారాయన్నారు. తమ సమ్మెలో ఇతర సంఘాలు కూడా పాల్గొనాలని రాకేశ్ టికాయత్ కోరారు. అప్పుడు అది ఒక్క రైతు సమ్మె మాత్రమే కాదన్నారు.
ఇది కూడా చదవండి:అదనపు డీజీపీలు సౌమ్యా మిశ్రా, డీఎస్ చౌహాన్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు
