న్యూఢిల్లీ: ‘కవచ్’ వ్యవస్థ వేగంగా ప్రయాణించే రైళ్లలోనూ మెరుగైన ఫలితాలు ఇచ్చినట్లు ఉత్తర మధ్య రైల్వే ప్రకటించింది. హరియాణాలోని పల్వాల్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర స్టేషన్ల మధ్య నడిచే సెమీ-హైస్పీడ్ రైలులో ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపింది. గంటకు 160 కి.మీ. వేగంలోనూ ఇది సమర్థంగా పనిచేసిందని పేర్కొంది.
Also Read.. రెచ్చిపోయిన లవర్స్.. కారులో నగ్నంగా రొమాన్స్
‘‘రెడ్ సిగ్నల్ పడినప్పుడు బ్రేకులు వేయొద్దని లోకో పైలట్‌కు సూచించాం. 160 కి.మీ. వేగంతో వస్తున్నా.. సిగ్నల్ పడగానే 30 మీటర్ల ముందే కవచ్ ఆటోమేటిగ్గా బ్రేకులు వేసి రైలును ఆపింది. త్వరలో ప్రయాణికులతో కూడిన రైలులో ఈ వ్యవస్థను పరీక్షిస్తాం.’’ అని ఉత్తర మధ్య రైల్వే జీఎం ప్రశస్తి తెలిపారు.
Also Read.. ఫార్మసిటీ, ఎయిర్ పోర్టు మెట్రో రద్దులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కవచ్ వ్యవస్థను రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) తయారు చేసింది. రెడ్ సిగ్నల్‌ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకుతీసుకెళ్లడం, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో ఈ వ్యవస్థ ఆటోమెటిక్ గా స్పందించి రైళ్ల వేగాన్ని తగ్గించడం, నిలిపివేయడం చేస్తుందని ఆర్‌డీఎస్‌వో అధికారులు తెలిపారు.
The post 160 కి.మీ. వేగంలోనూ ‘కవచ్’ సక్సెస్ appeared first on tnewstelugu.com.
