చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె, గాయని భవతరణి (47) కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. భవతరణికి శ్రీలంకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. రేపటిలోగా ఆమె భౌతికకాయం చెన్నైకు చేరుకుంటుందని, చెన్నైలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇళయారాజా కూతురు మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 2000 సంవత్సరంలో భారతి అనే సినిమాలో పాడిన మాయిల్ పోలా పొన్ను ఒన్ను పాటకు ఆమె నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.
Also Read.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు!
The post ఇళయరాజా ఇంట్లో విషాదం.. క్యాన్సర్‌తో కూతురు మృతి appeared first on tnewstelugu.com.
