దేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబిపి జవాన్లు ఘనంగా జరుపుకున్నారు. భారీగా మంచు కురుస్తున్న ప్రాంతాల్లో మోహరించిన భారత సైనికులు జాతీయ జెండాను ఎగురవేసి దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇండో-టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (ITBP) సైనికులు తమ చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, మంచు లోయల నుండి, భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేశారు.
X ప్లాట్‌ఫారమ్‌లో భారత సైనికుల ఈ వీడియోను ANI షేర్ చేసింది. ఇందులో భారతమాత వీర పుత్రుల అద్భుత ధైర్యసాహసాలు, దేశం కోసం ప్రాణత్యాగం చేయాలనే సంకల్పం కనిపిస్తుంది. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ తరపున, 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు జవాన్లు. ఆ తర్వాత వారంతా భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. సైనికుల పాదాలు ఒకటి నుండి ఒకటిన్నర అడుగుల వరకు మంచులోకి వెళ్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత చలిలోనూ సైనికుల మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు.
#WATCH भारत-चीन सीमा पर बर्फीले इलाकों में तैनात आईटीबीपी के हिमवीरों ने देशवासियों को 75वें गणतंत्र दिवस की शुभकामनाएं दीं।
(वीडियो सोर्स: ITBP) pic.twitter.com/RTCa6SobkO
— ANI_HindiNews (@AHindinews) January 26, 2024
ఇది కూడా చదవండి:అమెరికాలో తొలిసారిగా ఓ దోషికి వింత మరణశిక్ష..!!
The post భారత్-చైనా సరిహద్దులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు..!! appeared first on tnewstelugu.com.
