సికింద్రాబాద్లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దం అయింది. మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉత్తర మండల డీసీపీ కార్యాలయం సమీపంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. బేగంపేట్ నుండి మారేడ్ పల్లికి వెళ్తున్న క్రమంలో స్విఫ్ట్ కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకోవచ్చారు. అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also: నలుగురు ఫ్రాన్స్ వ్యక్తులకు పద్మ అవార్డులు
The post సికింద్రాబాద్లో రన్నింగ్ కారులో మంటలు.. పూర్తిగా దగ్దం appeared first on tnewstelugu.com.
