భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా దర్గాను సందర్శించారు. దాదాపు అరగంట పాటు మాక్రాన్ దర్గాలో బస చేశారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడికి చేరుకున్నారు. దేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన గురువారం మధ్యాహ్నం రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోదీతో కలిసి రోడ్ షో నిర్వహించిన అనంతరం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.
#WATCH | President of France Emmanuel Macron visited the Hazrat Nizamuddin Aulia Dargah on Friday. (26.01)
(Source: Hazrat Nizamuddin Aulia Dargah) pic.twitter.com/gf5hMBxZA4
— ANI (@ANI) January 26, 2024
ఇది కూడా చదవండి: నేటి నుంచి మాఘమాసం ప్రారంభం..!!
The post నిజాముద్దీన్ దర్గాను సందర్శించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్..!! appeared first on tnewstelugu.com.
