క్యారెట్, బీట్‌రూట్… రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే… ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు.
Health Tips | క్యారెట్, బీట్‌రూట్… రెండూ దుంపలే. పోషకాల్లో దిట్టలే! మరి ఈ రెండిటి కలయికతో చేసిన జ్యూస్ పుచ్చుకుంటే… ఎంతటి ఎనర్జీ డ్రింక్ అయినా దిగదుడుపే అంటున్నారు పోషకాహార నిపుణులు. అందుకు కారణాలూ చెబుతున్నారు.
- ఈ జ్యూస్ రక్తపోటును అదుపులో ఉంచుతుందని, బీట్‌రూట్‌లోని నైట్రేట్స్ రక్తనాళాలను తెరిచి గుండెకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణుల భరోసా.
- రెండిటిలోనూ లభించే యాంటీఆక్సిడెంట్స్ వల్ల కీళ్ల నుంచి ఊపిరితిత్తుల వరకు వాపునకు (ఇన్‌ఫ్లమేషన్) సంబంధించిన సమస్యలు రావు.
- బీట్‌రూట్, క్యారెట్లలో పీచుపదార్థం ఎక్కువ. దాంతో జీర్ణసంబంధమైన సమస్యలు తగ్గుతాయి. ఉదరంలో మంచి బ్యాక్టీరియా బలపడుతుంది.
- ఇందులోని పోషకాలతో పాటు విటమిన్-ఎ, సి రోగ నిరోధకశక్తిని పెంచి… ఇన్ఫెక్షన్లను తరిమికొడతాయి.
- ఈ రెండిటికీ కూడా సహజమైన డీటాక్స్ గుణం ఉంది. దానివల్ల ఇది కాలేయం లాంటి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
- ఈ జ్యూస్‌తో చర్మపు రంగు మెరుగుపడుతుందనీ… ఓ కొత్త మెరుపు వస్తుందనీ అంటారు.
- రోజూ తగిన మోతాదులో ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల కలిగే అనేకానేక లాభాలలో ఇవి కొన్ని. అలాగని హద్దులు మీరితే షుగర్ స్థాయి పెరగడం, మూత్రం ఎరుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు రావచ్చు.
