క్రికెటర్‌గా రాణించాలని ఎన్నో కలలుగన్న ఓ యువ పేసర్ జీవితం విషాదంగా ముగిసింది. మైదానంలోనే గుండె పోటుతో ప్రాణాలు విడిచాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన అతడి పేరు సుహైబ్ యాసిన్ క్రికెట్ ఆడుతుండగా మైదానంలోనే 20 ఏండ్ల యాసిన్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలాడు.
తోటి ఆటగాళ్లు యాసిన్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. శుక్రవారం హంజీవర ప్రాంతంలోని బారాముల్లాలో ఉన్న పట్టాన్‌లో సుహైబ్ క్రికెట్ మ్యాచ్ ఆడాడు.
ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలో ఇద్దరు అగంతకులు!
