Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు.
Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ (Gulf of Aden)లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటన్కు చెందిన ఓ నౌకపై (British oil tanker) క్షిపణితో దాడి చేశారు. దీంతో కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సౌత్ ఈస్ట్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది.
దాడి అనంతరం యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున.. ఈ మార్గంలో వెళ్లే నౌకలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఓ క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది.
Also Read..
Pneumonia | పాకిస్థాన్లో న్యుమోనియా విజృంభణ.. మూడు వారాల్లో 200 మంది చిన్నారులు మృతి
Road Accident | వేగంగా వెళ్తూ ఆటో, రెండు బైక్స్ను ఢీ కొట్టిన ఎస్యూవీ వాహనం.. ముగ్గురు మృతి.. షాకింగ్ వీడియో
Maratha Quota | మరాఠా రిజర్వేషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. దీక్ష విరమించిన ఉద్యమకారుడు మనోజ్ జరాంగే
