వేడి నీళ్లు తాగితే శరీరానికి చాలా మంచిది. వేడినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలుసు. రోజూ వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అంతేకాదు జీవక్రియను పెంచుతుంది. మొండి శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా బిపిని కంట్రోల్లో ఉంచుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.రోజూ వేడి నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే డయాబెటిస్ ప్రతిరోజూ వేడినీళ్లు తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందా? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు. తెలుసుకుందాం.
వేడినీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?
వేడి నీళ్ళు తాగడం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ తగ్గుతుంది కానీ కేవలం వేడి నీళ్ల వల్ల షుగర్ తగ్గుతుందని కాదు. శరీరంలో నీరు లేకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, వేడిగా ఉన్నా, మామూలుగా ఉన్నా నీటిని తాగుతూనే ఉండాలి. వేడి నీటిని తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయంలో వేడి నీటిని తాగడం వల్ల షుగర్ పేషంట్లకు మరింత మేలు జరుగుతుంది.
నిపుణులు ఏమంటున్నారు?
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, మీరు మీ మొత్తం జీవనశైలిని మార్చుకోవాలి. ఇది సాధారణంగా సమతుల్య, పోషకమైన ఆహారం, సాధారణ వ్యాయామం చేస్తుండాలి.అందువల్ల, ఒక వ్యక్తికి మధుమేహం ఉంటే, అతను ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి.
ఇది కూడా చదవండి: నేడు బీహార్ సీఎం రాజీనామా? రేపు కొత్త సర్కార్ ఏర్పాటు..?
The post డయాబెటిస్ వేడినీళ్లు తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుందా? appeared first on tnewstelugu.com.
