విజయవంతంగా పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ ముగించిన బీఆర్ఎస్ ఇప్పుడు అసెంబ్లీస్థాయి సమావేశాలకు రంగం సిద్ధం చేసింది. దీనికంటే ముందుగా మైనార్టీ కమిటీ సమావేశం జరుగనుంది. తెలంగాణ భవన్ లో శనివారం ఈ సమావేశం మొదలైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశంకానున్న ఈ మీటింగ్ కి మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీలు హాజరు కానున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గస్థాయిలో మైనార్టీల సమావేశాలు నిర్వహించాలని, బీజేపీ, కాంగ్రెస్ మైత్రిని వివరించాలని నిర్ణయించారు.బీజేపీ మతతత్వం, కాంగ్రెస్ తో చీకటి ఒప్పందాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.
రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీని కలిసాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని.. మోడీ అండతో బీఆర్ఎస్ ని పూర్తిగా లేకుండా చేయాలనీ కాంగ్రెస్ పన్నాగాలు వేస్తున్నట్టు మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సొంత మీడియాలోనే మోడీతో మైత్రిపై కథనాలు వచ్చాయి. ఈ చీకటి ఒప్పందాన్ని బట్టబయలు చేస్తూ.. బండి సంజయ్ కూడా బహిరంగంగా కాంగ్రెస్ కి స్నేహ హస్తం అందించారు. కలిసి బీఆర్ఎస్ ని ఖతం చేద్దామని బండి రేవంత్ కి పిలుపు నిచ్చాడు. ఇక బీజేపీ బినామీ అదానీ అని నిత్యం విమర్శించే కాంగ్రెస్ అదే అదానితో ములాఖత్ అయిన విషయాన్నీ కూడా ప్రజలకు వివరించాలని ఈ మైనార్టీ కమిటీ సమావేశంలో చర్చ జరగనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఒక్క మైనార్టీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదని,ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఏమీ చేయడంలేదని వివరించనున్నారు. ప్రతి జిల్లా నుంచి ముఖ్యనాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
