కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, కేరళ రాజ్‌భవన్‌కి జెడ్ ప్లస్(Z+) భద్రతను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పొడిగించింది. మరోవైపు కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం పినరయి విజయన్ మధ్య వైరం ముదిరింది. తాజాగా ఆయనను సీపీఎంకి చెందిన స్టూడెంట్స్ అడ్డుకున్నారు. నల్లజెండాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా కారు నుంచి దిగిన గవర్నర్.. ఆందోళన చేస్తున్న విద్యార్థుల వైపు వెళ్లడం కలకలం సృష్టించింది.
గవర్నర్, ఎస్ఎఫ్ఐ సభ్యుల మధ్య రెండు గంటల పాటు హైడ్రామా చోటు చేసుకుంది. గవర్నర్ రోడ్డుపై బైఠాయించి చర్యలు తీసుకునే వరకు వెళ్లేది లేదని మొండికేశారు. సీఎం విజయన్ ప్రభుత్వం అన్యాయాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. చివరకు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని చూపించడంతో ఆయన అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.
ఇదిలా ఉండగా.. కేరళలో యూనివర్సిటీల పనితీరు మరియు అసెంబ్లీ ఆమోదించిన కొన్ని బిల్లులపై సంతకం చేయడానికి గవర్నర్ నిరాకరించడంతో వివాదం రాజుకుంది. అప్పటినుంచి పలు అంశాలపై భిన్నాభిప్రాయాలతో గవర్నర్ కు లెఫ్ట్ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోంది.
Also Read.. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడి!
