సూర్యాపేటలో కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ అడ్డుకుంది. సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అధికారం అడ్డం పెట్టుకుని ఎదో చేయాలనుకుంటే ఇక్కడ సాగదు. పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి విజయం సాధించాలి. అందుకోసం కష్టపడాలి. కాంగ్రెస్ హామీలపై ప్రజల పక్షాన నిలబడాలి. ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఉద్యమంలో లాగా సింహాల్లా కదలాలి. రైతుబంధు పడట్లేదు. కరెంట్ పోతుంది.
రైతుబంధుకు 15 వేలు అని మోసం చేస్తున్నారు. రైతుబంధు డబ్బులు ఎటూ పోయాయి. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తా అన్నారు. మరీ అది ఏ పుట్టినరోజు రోజో చెప్పలేదు. సాగర్ ఆయకట్టుకు కృష్ణా నీళ్లు ఇవ్వలేక పోయారు. ఎస్ఆర్ఎస్పి లో నీళ్లు ఉన్న ఇవ్వడం లేదు. కార్యకర్తలు దైర్యంగా ఉండాలి. వారం పది రోజుల్లోనే కెసిఆర్ బయటకు వస్తారు. తొందరలోనే నల్లగొండ వస్తా అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం.
