స్టార్ సెలబ్రిటీ జంట సూర్య జ్యోతికల విడాకుల అంశం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. వీరిద్దరూ విడిపోయే అవకాశం ఉందని చాలా కాలంనుండి ఊహాగానాలు వస్తున్నాయి. చాలా సంవత్సరాల డేటింగ్ తర్వాత సెప్టెంబర్ 11, 2006న సూర్య జ్యోతికలు పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా అనే కుమార్తె, దేవ్ అనే కుమారుడు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో సూర్య తన ఫ్యామిలీతో ముంబైకి మకాం మార్చారు. అప్పటినుండి ఈ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. సూర్యకి ఇష్టంలేకుండా తల్లితండ్రులతో జ్యోతిక విడకొట్టింది అని, వీరిద్దరి మధ్య కూడా తీవ్ర మనస్పర్థాలు ఉన్నాయని తమిళ మీడియా కథనాలు ప్రచురించింది.
ఈ నేపథ్యంలో ఎట్టకేలకు ఈ రూమర్స్ పై జ్యోతిక స్పందించారు. తనకు, సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. పిల్లల చదువు, తాను బాలీవుడ్ సినిమాలకు కమిట్ కావడం, తన తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేకపోవడం తదితర కారణాల వల్లే ముంబైకి మారామని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టు తమ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవని తెలిపారు. తన భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తి అని కితాబునిచ్చారు. పిల్లల చదువు పూర్తి కాగానే చెన్నైకి తిరిగొస్తామని చెప్పారు. జ్యోతిక వివరణతోనైనా విడాకుల ప్రచారానికి తెర పడుతుందేమో వేచి చూడాలి.
