నల్గొండ జిల్లాకేంద్రంలో జగదీశ్ రెడ్డి మీడియాతో ముచ్చటించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం అని అన్నారు. ‘హామీలు అమలు చేతలేకనే ఎదురు దాడులు చేస్తుంది కాంగ్రెస్. రుణమాఫీ,రైతు బంధు డిమాండ్లు ప్రజల నుండి వచ్చినవే. వాటిని అమలు జరప మన్నందుకే చెప్పులతో దాడులంటూ బెదిరింపులు. అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణకు డిమాండ్ చేసింది మేమే. వ్యక్తిగతంగా మాట్లాడితే రోడ్ల మీద తిరగ లేరు. అధికారం ఎప్పుడూ ఎవ్వరికీ శాశ్వతం గాదు.
తాము అధికారంలో ఉండగా ఈ తరహా దాడులకు ఉసి గొల్ప లేదు. కృష్ణా జలాల అక్రమ తరలింపును నిలువరించ లేని దద్దమ్మలు. పెదవులకు పదవులు అడ్డుపడి తెలంగాణాను ఎడారిగా మార్చారు. మీ బాస్ లు వై యస్, చంద్రబాబులు అక్రమ కేసులు పెట్టిన రోజునే భయపడ లేదు. తెలంగాణాకు పోరాటాలు నేర్పిందే నల్లగొండ జిల్లా. సూర్యాపేట నుండి గులాబీ గెలుపు మొదలైంది. కాంగ్రెస్,బిజెప లు ఒక్కటయ్యాయి అనడానికి మున్సిపల్ అవిశ్వాసలే నిదర్శనం. వారం పదిరోజుల్లో ప్రజల ముంగిటకు గులాబీ బాస్ కేసీఆర్ రాబోతున్నారు. త్వరలోనే నల్లగొండ కు కూడా కేసీఆర్ వస్తారు అని చెప్పారు జగదీశ్ రెడ్డి.
The post బచ్చా రేవంత్.. వైఎస్సార్, చంద్రబాబులకే భయపడలే.. నువ్వెంత..! appeared first on tnewstelugu.com.
