ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో మాతా జాగరణ సందర్భంగా వేదిక కూలిపోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు . ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.రాత్రి 12గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గాయకుడు ప్రాక్ ఈ జాగ్రన్ కు రావడంతో అతన్నిచూసేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు తరలివచ్చారు. ఇంతలో ప్రాక్ వేదికపై వచ్చి తన ప్రదర్శనను ప్రారంభించాడు. ఆ వెంటనే స్టేజీ కూలిపోయింది. తర్వాత తొక్కిసలాట జరగడంతో..ఓ మహిళ మరనించింది. స్టేజికింద చిక్కుకున్న స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు.
ఇది కూడా చదవండి : భార్య శవాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త..!!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రైమ్ టీమ్ ఘటనా స్థలాన్ని సందర్శించింది. క్షతగాత్రులందరి పరిస్థితి నిలకడగా ఉంది, మరికొందరికి ఫ్రాక్చర్లు ఉన్నాయి. ఈ వ్యవహారంలో నిర్వాహకులపై ఐపీసీ సెక్షన్ 337/304A/188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
#WATCH | Delhi | 17 people injured and one died when a platform, made of wood and iron frame, at a Mata Jagran at Mahant Parisar, Kalkaji Mandir collapsed at midnight on 27-28 January. Case registered against the organisers.
(Video: Viral visuals confirmed by Police) https://t.co/r6bE9dh3ds pic.twitter.com/xJgJ0wSdqB
— ANI (@ANI) January 28, 2024
The post ఆలయంలో కూలిన వేదిక…ఒకరు మృతి, వీడియో వైరల్..!! appeared first on tnewstelugu.com.
